BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:39 pm
Posted by : KOLA MAHESH

రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
07 Oct, 2026 - 09:39 PM
8 వీక్షణలు

యాదాద్రి జిల్లా: రామన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల లభ్యతపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్పత్రిని పరిశీలించారు. టీడీపీ మండల ఇన్‌చార్జ్ మీర్జా ఫజిల్ బేగ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల నాయకులు బత్తుల సత్యం, వడ్లకొండ సత్తయ్య ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రామన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంతకాలంగా వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. రోగికి ఉన్న సమస్యను నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించకుండానే వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో అవసరమైన కొన్ని మందులు, ఇంజక్షన్లు అందుబాటులో లేవని, గాయాలకు ఉపయోగించే మందులు, ఆయింట్‌మెంట్లు కూడా లభించని పరిస్థితి ఉందని ఆరోపించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల తరఫున మరింతగా స్పందించి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేపడతామని టీడీపీ నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.