BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 13 October 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో టీడీపీ మహిళా నేత చాపల లీలా ప్రశాంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 09:39 PM
7 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కోసం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నాయకురాలు చాపల లీలా ప్రశాంతి చైర్‌పర్సన్ పదవికి ఆశావహిగా ముందుకు వచ్చారు.

ఈ మేరకు ఆమె చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ను కలిసి తన అభ్యర్థిత్వానికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్న లీలా ప్రశాంతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె ప్రయత్నించినప్పటికీ చివరి దశలో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం చింతలపూడి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మరోసారి రాజకీయ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు.

పార్టీ కోసం చేసిన సేవలు, మహిళా నాయకురాలిగా తనకున్న గుర్తింపు, రిజర్వేషన్ అంశాలు తనకు అనుకూలంగా మారుతాయని లీలా ప్రశాంతి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్ ఎంపికపై టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.