BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రెండో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 06:11 PM
1 వీక్షణలు

రెండో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి

పాలమూరు: కోయిలకొండ మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి జోగు రాకేష్‌పై ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థిని కర్రతో కొట్టడంతో బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో విషయం తల్లిదండ్రుల ద్వారా బయటకు వచ్చింది.

ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల వ్యవహారశైలిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

విద్యార్థిపై దాడికి బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. అలాగే పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణను మరింత పెంచాలని కోరారు.

ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.