BREAKING
thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 01:24 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఏపీకి తెలంగాణ విద్యుత్ సిబ్బంది సహాయం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Oct, 2026 - 01:24 PM
7 వీక్షణలు

తుఫాన్‌తో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు సహాయక బృందాల పంపిణీ

భట్టి విక్రమార్క ఆదేశాలతో రంగంలోకి TGSPDCL సిబ్బంది

హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సహాయక బృందాలను పంపించాలని ఇంధన శాఖ ఉన్నతాధికారులు, TGSPDCL, NPDCL సీఎండీలను భట్టి విక్రమార్క ఆదేశించారు.

తుఫాన్‌తో భారీగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సమాచారం. వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ బృందాలు

డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ విద్యుత్ సిబ్బందితో కూడిన సహాయక బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించేందుకు ఈ బృందాలు సహకరించనున్నాయి.

తుఫాన్ విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలుస్తోంది.