తెలంగాణ SIR షెడ్యూల్ మరోసారి సవరణ
- నవంబర్ 26 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి గడువు పొడిగింపు
- నవంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురణ
హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–SIR) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. అక్టోబర్ 29న కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కీలక తేదీలను మార్చింది.
నవంబర్ 26 వరకు గడువు పొడిగింపు
ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి గతంలో నిర్ణయించిన నవంబర్ 5 గడువును నవంబర్ 26 వరకు పొడిగించింది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న అభ్యంతరాలు, నోటీసుల పరిష్కారానికి అధికారులకు మరింత సమయం లభించనుంది.
నవంబర్ 30న తుది ఓటరు జాబితా
గత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 9న ప్రచురించాల్సిన తుది ఓటరు జాబితా తేదీని కూడా ఎన్నికల సంఘం మార్చింది. తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ తుది ఓటరు జాబితాను నవంబర్ 30, 2026న ప్రచురించనున్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, సవరించిన షెడ్యూల్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు సూచించింది.