BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రొద్దుటూరులో ఆలయ హుండీ చోరీ.. రూ.1.5 లక్షలకు పైగా నగదు అపహరణ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:31 PM
2 వీక్షణలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ప్రసిద్ధ శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని చోరీ చేసి, అందులోని నగదును అపహరించారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆలయ నిర్వాహకులు, భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. సమీపంలోని కంపచెట్ల పొదల్లోకి తీసుకెళ్లి హుండీని పగలగొట్టి, అందులోని నగదును అపహరించినట్లు తెలుస్తోంది.

హుండీలో రూ.1.5 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు అంచనా

భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలతో హుండీలో సుమారు రూ.1.5 లక్షలకు పైగా నగదు ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అయితే చోరీకి గురైన నగదు విలువపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

సీసీ కెమెరాల్లో అస్పష్టంగా నిందితుల దృశ్యాలు

చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంటిలోని కెమెరా పనిచేయడం లేదని నిర్వాహకులు తెలిపారు. మరో కెమెరాలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వారి గుర్తింపు కష్టంగా మారిందని పేర్కొన్నారు.

పోలీసులకు ఆలయ కమిటీ ఫిర్యాదు

ఆలయంలో చోరీ ఘటనపై ఆలయ కమిటీ సభ్యుడు, మాజీ కౌన్సిలర్ వరికుట్టి ఓబుల్ రెడ్డి ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించి చోరీకి గురైన నగదును స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.