శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ఆంధ్రప్రదేశ్
శాప్ కార్యాలయం ఉన్న స్టేడియం సమీపంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్టేడియం వైపు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. రెడ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి, వైసీపీ నేతలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శాప్ కార్యాలయం ఉన్న స్టేడియం వైపు వెళ్లకుండా పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ర్యాలీ నిర్వహించి తీరుతామని వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, వైసీపీ నేతల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.