BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 05:53 pm
Posted by : KOLA MAHESH

ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి

తెలంగాణ
/ తెలంగాణ / నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
07 Oct, 2026 - 05:53 PM
6 వీక్షణలు
ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటానికి సంపూర్ణ మద్దతు: కోల మహేష్ ముదిరాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా: నారాయణపురం: అక్టోబర్ 7

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నారాయణపురం మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోల మహేష్ ముదిరాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆరోపణలపై ఎన్నికల సంఘం పారదర్శకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం బాధాకరమని కోల మహేష్ పేర్కొన్నారు. అక్టోబర్ 6న ఢిల్లీలో జరిగిన నిరసనలో పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, ఓటర్ల జాబితా సవరణపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.