BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 09:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూలీ కొడుకు కలల విజయం.. KBCలో రూ.కోటి గెలుపు!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:00 AM
22 వీక్షణలు

మహారాష్ట్ర యువకుడు భూషణ్ ఠాక్రే అరుదైన ఘనత.. తల్లి త్యాగానికి ప్రతిఫలం ఇవ్వాలన్న సంకల్పం మహారాష్ట్ర: పేదరికం ప్రతిభకు ఏమాత్రం అడ్డుకాదని మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన యువకుడు భూషణ్ ఠాక్రే నిరూపించారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆయన తన పట్టుదల, ప్రతిభతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్పతి-18'లో ఏకంగా రూ.కోటి గెలుచుకుని ఈ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా రికార్డు సృష్టించారు. భూషణ్ తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువుపై ఆసక్తిని మాత్రం భూషణ్ వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరిమిత వనరులతోనే తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అయితే భూషణ్ విజయం వెనుక తల్లి చేసిన త్యాగం మరింత భావోద్వేగానికి గురిచేస్తోంది. తన చదువు కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో తల్లి తన బంగారు నగలను సైతం విక్రయించారు. ఆ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పిన భూషణ్.. కేబీసీలో గెలుచుకున్న డబ్బుతో ముందుగా తల్లి విక్రయించిన బంగారు నగలను తిరిగి కొనివ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తించి, వారికి సంతోషాన్ని అందించాలన్నదే తన కోరికని ఆయన చెప్పిన మాటలు పలువురిని కదిలిస్తున్నాయి. కోటి రూపాయల విజయం కంటే తల్లి త్యాగానికి విలువ ఇవ్వడం, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ఇప్పుడు భూషణ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. పేదరికాన్ని అధిగమించి లక్ష్యసాధన దిశగా సాగుతున్న ఈ యువకుడి ప్రయాణం విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.