BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:50 pm
Posted by : KADARI RAMANA

అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana Nirmal Rural
07 Oct, 2026 - 06:50 PM
4 వీక్షణలు

నిర్మల్: జిల్లాలో 89 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు, అభ్యర్థుల అర్హత పరిశీలన, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భర్తీ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.

అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన సమాచారం, తదుపరి దశల వివరాలను దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల, గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల అర్హత, ధ్రువీకరణ పత్రాల పరిశీలనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు తలెత్తకుండా అధికారిక సమాచారాన్ని స్పష్టంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

భర్తీ చేయిస్తామని చెప్పే దళారులు లేదా ఇతర వ్యక్తుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని, భర్తీ ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

అభ్యర్థుల అర్హత, ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భర్తీ ప్రక్రియపై వచ్చే సందేహాలు, ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, సీడీవోలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.