ధరల పెరుగుదలను నియంత్రించాలి
ధరల పెరుగుదలను నియంత్రించాలి
యూపీఐ చెల్లింపులపై చార్జీలను ఉపసంహరించుకోవాలి.భగత్ సింగ్ నగర్ గుడిసె వాసులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. సిపిఎం డిమాండ్
యూపీఐ చెల్లింపులపై చార్జీలను ఉపసంహరించుకోవాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, బాగ్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు కే రమేష్ అధ్యక్షతన బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం దశరథ్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయాలని నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎస్ ఐ ఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల ఓట్లను తొలగిస్తుందని, తొలగించిన ఓటర్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గత 30 - 40 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న భగత్ సింగ్ నగర్ గుడిసె వాసులకు అక్కడే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు, బాగలిగంపల్లి డివిజన్ పరిధిలోని పాలమూరు బస్తీలో డ్రైనేజ్ పైప్ లైన్ లను మార్చాలని, ఎల్ఐజీ క్వార్టర్స్ లో మంచినీటి పైప్లైన్లను మార్చాలని, అచ్చయ్య నగర్ లో ఇళ్ల మధ్యలో ఉన్న గ్యాస్ గోడౌన్ తరలించాలని డిమాండ్ చేశారు. డివిజన్ పరిధిలో ఉన్న అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జోన్ కమిటీ సభ్యురాలు వెంకటమ్మ నాయకులు వెంకటయ్య, మల్లయ్య, రాజు, రమణమ్మ, శంకరయ్య, పెద్దయ్య, కృష్ణవేణి , జయమ్మ తదితరులు పాల్గొన్నారు.