BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:23 PM
27 వీక్షణలు

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ద్వితీయ స్థానం మండల స్థాయిలో సత్తా చాటిన విద్యార్థుల బృందం.. సర్టిఫికెట్లు, షీల్డ్ అందజేత

సత్తుపల్లి: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో స్థానిక టాలెంట్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజ్ఞాన శాస్త్రంపై తమకున్న ఆసక్తి, విషయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచనా సామర్థ్యంతో పోటీలో ఇతర విద్యార్థులకు దీటుగా నిలిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ పోటీలో టాలెంట్ స్కూల్‌కు చెందిన ముప్పాళ కావ్య, షేక్ ఆస్పియా, నక్క జోశ్విత్ చరణ్‌లతో కూడిన బృందం మండల స్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. విజేతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లతో పాటు షీల్డ్‌ను అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, పరిశీలన, విశ్లేషణ, తార్కికంగా ఆలోచించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇటువంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. చిన్న వయసు నుంచే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకుని పోటీల్లో విజయాలు సాధించడం అభినందనీయమని తెలిపింది. ఈ సందర్భంగా విజేత విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ అరుణ, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.