BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 03:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రాచర్ల గొల్లపల్లిలో మూడు ఆలయాల్లో చోరీలు

తెలంగాణ
/ రాజన్న సిరిసిల్ల
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Nov, 2026 - 03:12 PM
14 వీక్షణలు

హుండీలను ధ్వంసం చేసి నగదు అపహరణ.. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున మూడు ఆలయాల్లో చోరీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు పురాతన శివాలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, గాలం గుట్ట ఆంజనేయస్వామి ఆలయాల్లోని హుండీలను ధ్వంసం చేసి నగదును అపహరించారు.

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలోని హుండీని బయటకు తీసుకొచ్చి పగులగొట్టగా, మిగిలిన రెండు ఆలయాల్లో హుండీల్లోని నగదును దొంగిలించారు. శుక్రవారం ఉదయం చోరీ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. వాటి ఆధారంగా ఓ అనుమానితుడిని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

చోరీకి గురైన నగదు ఎంత అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.