చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దొరల గడీలను ఎదిరించి, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన ఐలమ్మను అవమానించడం సమాజానికి తీరని నష్టమని పేర్కొన్నారు.
రజకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తామని గోలి కిష్టయ్య హెచ్చరించారు.