ఢిల్లీలో నిరసనకు వెళ్తున్న ముగ్గురు అరెస్ట్.. షరతులతో బెయిల్
జాతీయం
జాతీయం
విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏడాది పాటు శాంతిభద్రతలు పాటించాలని కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న ముగ్గురిని పోలీసులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. విమానం నుంచి దిగకముందే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
ఏడాది పాటు శాంతియుతంగా ఉండాలని, సత్ప్రవర్తనతో మెలగాలని షరతు విధిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.