BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:31 PM
8 వీక్షణలు

ఏఎస్డీడీ జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం.. ఆర్డీఓ ఏ. కుమార్

తిరువూరు: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాలో వివిధ కారణాలతో పేర్లు తొలగించబడిన లేదా ఏఎస్డీడీ (గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ పేర్లు) కేటగిరీలో గుర్తించబడిన ఓటర్లకు తమ అర్హతను నిరూపించుకొని తిరిగి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ఏఎస్డీడీ జాబితాలో గుర్తించిన ఓటర్ల అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ ఏ. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాలుగు మండలాల తహసీల్దార్లు, తిరువూరు మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్లకు కల్పించాల్సిన అవకాశాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఏఎస్డీడీ జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సంబంధిత వ్యక్తి ఓటు హక్కుకు శాశ్వతంగా దూరమైనట్లు కాదని, తగిన ఆధారాలు సమర్పించి తమ అర్హతను నిరూపించుకునే అవకాశం ఉందని వివరించారు. గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, మరణం లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదై ఉండటం వంటి కారణాలతో గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు.

సంబంధిత ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏఎస్డీడీ జాబితాలో తమ పేరు ఉన్న ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థానిక బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓ) లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఓటర్ల జాబితా పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా డీఈఓలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓలు పరస్పర సమన్వయంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీఓ ఏ. కుమార్ కోరారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు.