BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 05:14 pm
Posted by : MUSUGU GOPI

తెలుగు రాష్ట్రాలకు మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్‌కు రైలు మార్గం!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
22 Nov, 2026 - 05:14 PM
14 వీక్షణలు

మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌, రాజంపేట–నెల్లూరు, సామర్లకోట–చింతూరు మార్గాలకు ప్రతిపాదనలు

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించే దిశగా మూడు కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌, రాజంపేట–నెల్లూరు, సామర్లకోట–చింతూరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గాల ద్వారా ప్రయాణికుల రవాణాతోపాటు పారిశ్రామిక అవసరాలు, పోర్టుల అనుసంధానం, ఖనిజాల రవాణాకు అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రతిపాదిత మార్గాల అవసరం, ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు, సరకు రవాణాకు ఉన్న అవకాశాలను అధికారులు వివరించారు. రైల్వే బోర్డు నుంచి అనుమతులు లభిస్తే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) చేపట్టి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైల్వే మార్గాల ఆవశ్యకతను వివరిస్తూ రైల్వేశాఖకు లేఖలు రాసింది.

సామర్లకోట–చింతూరు.. ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ

సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా పోలవరం జిల్లా చింతూరు సమీపం వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని అనేక మండలాలకు రైలు సదుపాయం అందుబాటులో లేదు. ఈ మార్గం నిర్మితమైతే సామర్లకోట, రాజమహేంద్రవరం వైపు నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది.

ఇప్పటికే ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మీదుగా తెలంగాణలోని భద్రాచలం, పాండురంగాపురం వరకు 173 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ మంజూరైంది. తాజాగా ప్రతిపాదించిన సామర్లకోట–చింతూరు మార్గం ఈ లైన్‌తో అనుసంధానమైతే మూడు రాష్ట్రాల మధ్య రైల్వే రవాణా మరింత విస్తరించే అవకాశం ఉంది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రాంతాల నుంచి బొగ్గు, ఇనుప ఖనిజాన్ని కాకినాడ పోర్టుకు తరలించేందుకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితోపాటు సరకు రవాణాకు కొత్త మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

రాజంపేట–నెల్లూరు.. 120 కిలోమీటర్ల కొత్త లైన్‌ ప్రతిపాదన

రాజంపేట నుంచి నెల్లూరు వరకు సుమారు 120 కిలోమీటర్ల మేర మరో కొత్త రైల్వే లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరుకు నేరుగా రైలు మార్గం లేకపోవడంతో ప్రయాణికులు రేణిగుంట మీదుగా వెళ్లాల్సి వస్తోంది.

ఓబుళవారిపల్లె నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటికే రైల్వే లైన్‌ ఉన్నప్పటికీ, అది కృష్ణపట్నం రైల్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధీనంలో ఉంది. ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు నడపాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ, మధ్యలో ఉన్న పొడవైన సొరంగం భద్రతాపరమైన సమస్యగా మారుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులను బయటకు తీసుకురావడం కష్టమనే ఆందోళనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాజంపేట నుంచి నెల్లూరుకు ప్రత్యేకంగా కొత్త రైల్వే లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలు సులభతరం కావడంతోపాటు కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరకు రవాణా కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది.

మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌.. భక్తులకు ప్రయోజనం

మరో కీలక ప్రతిపాదనగా మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్‌ వరకు సుమారు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నేరుగా రైల్వే సదుపాయం లేదు. ఈ మార్గం నిర్మితమైతే తెలంగాణతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సికింద్రాబాద్‌ వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్‌, దక్షిణాది ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు మార్కాపురం వైపు నుంచి రైలులో శ్రీశైలం చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

శ్రీశైలం క్షేత్రానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే యాత్రికుల ప్రయాణం మరింత సులభతరం కావడంతోపాటు స్థానిక పర్యాటక, వాణిజ్య రంగాలకు కూడా ప్రయోజనం కలగనుంది. మరోవైపు దొనకొండ–ఒంగోలు మధ్య కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి ఇప్పటికే సర్వే, డీపీఆర్‌ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌ మార్గం కూడా నిర్మితమైతే కృష్ణపట్నం, రామాయపట్నం నౌకాశ్రయాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.

రైల్వే బోర్డు ఆమోదం తర్వాతే తదుపరి ప్రక్రియ

ఈ మూడు ప్రతిపాదిత రైల్వే మార్గాలు కార్యరూపం దాల్చితే ప్రయాణికుల రవాణాతోపాటు పారిశ్రామిక అవసరాలు, ఖనిజాల తరలింపు, పోర్టుల అనుసంధానానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు రైలు సదుపాయం కల్పించడం, శ్రీశైలం క్షేత్రాన్ని రైల్వే నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం, రాయలసీమ–కోస్తా ప్రాంతాల మధ్య రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

అయితే ఈ మూడు మార్గాలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనకు పంపిన ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఎఫ్‌ఎల్‌ఎస్‌, డీపీఆర్‌ తయారీకి అనుమతులు లభించడంతోపాటు, అనంతరం నిధులు, నిర్మాణానికి అధికారిక ఆమోదం లభించినప్పుడే పనులు ముందుకు సాగనున్నాయి. దీంతో ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.