BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా..

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:59 PM
7 వీక్షణలు

అవసరమైన చోట్ల డ్రోన్లతో పర్యవేక్షణ ఓటర్లు భయం, ఒత్తిడి లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు అనంతపురం: అనంతపురం జిల్లాలో ఈనెల 26న 13 మండలాల్లో జరగనున్న తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, అదేరోజు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిని స్పష్టంగా గుర్తించి, అనుమతి లేని వ్యక్తులు, వాహనాలను లోపలికి అనుమతించరాదని తెలిపారు. వాహనాల పార్కింగ్‌ను నిర్దేశిత ప్రాంతాలకు వెలుపల ఏర్పాటు చేయాలని, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రచారం, గుంపులుగా చేరడం వంటి చర్యలకు అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మొబైల్ పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాలు తమకు కేటాయించిన మార్గాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన చోట్ల సైరన్లు, ధ్వనివర్ధక పరికరాల ద్వారా ప్రజలకు సూచనలు చేయాలన్నారు. పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో పూర్తి యూనిఫాంలో ఉండటంతో పాటు లాఠీ, విజిల్, అత్యవసర సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఓటర్లను క్రమబద్ధమైన వరుసల్లో పంపిస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకురాకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నియమావళి, పోలీసు చట్టం 30, సెక్షన్ 163 నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపునకు తగిన భద్రత కల్పించాలని ఎస్పీ సూచించారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు.