BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:04 pm
Posted by : K MAHESH

పిల్లల్లో పోషకాహార లోపం నివారణకే ‘తొలిముద్ద’ కార్యక్రమం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:04 PM
16 వీక్షణలు

బడి తండా అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృనాయక్

ప్రీ స్కూల్ పిల్లలకు పోషకాలతో కూడిన అల్పాహారం.. బాలామృతం క్రమం తప్పకుండా అందించాలి

నెల్లికుదురు, నవంబర్ 21:

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని బడి తండా గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృనాయక్ అన్నారు.

శనివారం నెల్లికుదురు మండలంలోని బడి తండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలు కలిగిన అల్పాహారం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఉప్మా, కిచిడీ వంటి పోషకాహార పదార్థాలను చిన్నారులకు అందించడం ద్వారా వారిలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలు కలిగిన బాలామృతాన్ని కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించాల్సిన పోషకాహార పదార్థాలను సక్రమంగా పంపిణీ చేయాలని సర్పంచ్ సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, అంగన్వాడీ ఉపాధ్యాయినులు వలబోజు కవిత, బిలావత్ అరుణ, గుగులోతు కవిత, ఆయా చిలుకమ్మ, ఆశా కార్యకర్త, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.