గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు: నగరంలో అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శంకర్ విలాస్ సెంటర్‌లో అండర్‌పాస్ నిర్మాణ పనులు చేపడుతున్నందున బ్రాడీపేట–అరండల్‌పేట 4వ లైన్ ఎంట్రన్స్‌ను ఆదివారం నుంచి మూసివేయనున్నట్లు తెలిపారు.
బ్రాడీపేట 1, 2, 3వ లైన్ల నుంచి దొంకరోడ్డు వైపు వెళ్లే వాహనాలు ఏఆర్‌పీ 1వ లైన్ మీదుగా వెళ్లాలని సూచించారు.
అదేవిధంగా బ్రాడీపేట 4వ లైన్ నుంచి వచ్చే వాహనాలు గురవయ్య స్కూల్, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ మీదుగా దొంకరోడ్డు నుంచి బ్రాడీపేట వైపు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.