బాలానగర్‌లో ఫ్లైఓవర్ పనులతో ట్రాఫిక్ జామ్.. ప్రయాణికుల ఇబ్బందులు
తెలంగాణ
బాలానగర్: బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలు మందగించడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం అవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పెరుమాళ్ల ప్రవీణ్ కుమార్
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్, బాలానగర్ మండలం