BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 02:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నెక్కొండలో విషాదం.. స్కూల్ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 02:02 PM
6 వీక్షణలు

నెక్కొండ: వరంగల్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాకు చెందిన రాహుల్ (3) స్కూల్ బస్సు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

స్థానికుల వివరాల ప్రకారం.. బాలుడు స్కూల్ బస్సు కింద పడగా, బస్సు బాలుడి తలపై నుంచి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఇతర వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

బాలుడి మృతితో పిట్టకాలుబోడు తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.