మంచిర్యాలలో గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు
మంచిర్యాల: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్ మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్మా గాంధీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ ఖలీద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజితతో పాటు పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.