BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 08:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వైభవంగా తులసి లక్ష్మీనారాయణుల కల్యాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 08:12 AM
84 వీక్షణలు

భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.. భక్తిపారవశ్యంలో హనుమాన్ చాలీసా పారాయణం

పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో వరుసగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తిభావం వెల్లివిరిసింది. లోకకల్యాణం, గ్రామ ప్రజల సుఖసంతోషాలు, సర్వజన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించగా, మరోవైపు తులసి లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన

ఆదివారం ఉదయం గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం నుంచి నగర సంకీర్తన ప్రారంభమైంది. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి, శ్రీరామ, జయరామ, జయజయ రామ నామాలను స్మరిస్తూ భజనలు, సంకీర్తనలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయం, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పాశం వెంకటేశ్వర్లు, వడ్డెరపు నాగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా తులసి లక్ష్మీనారాయణుల కల్యాణం

కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శనివారం రాత్రి పెనుగొలను గ్రామంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయ ప్రాంగణంలో తులసి లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత తులసి కోటను శుభ్రపరిచి పసుపు, కుంకుమలతో పాటు రంగవల్లులతో అందంగా అలంకరించారు.

అనంతరం ఆలయ అర్చకులు తూమాటి యోగానందాచార్యులు వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దంపతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

భక్తిపారవశ్యంలో హనుమాన్ చాలీసా పారాయణం

గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో ఉన్న ఏకశిలా అభయాంజనేయస్వామి విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులంతా సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

భజనలతో పరిసర ప్రాంతాలు మార్మోగగా, భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పసుమర్తి లక్ష్మణరావు, రాళ్లచర్ల జగన్నాథం తదితరులు పర్యవేక్షించారు.

ఒకే గ్రామంలో వరుసగా నిర్వహించిన నగర సంకీర్తన, తులసి లక్ష్మీనారాయణుల కల్యాణం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు పెనుగొలను గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ వేడుకలు గ్రామ ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను మరింత పెంపొందించాయి.