బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరి అరెస్టు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఒంగోలు: నగరంలోని గోపాల్‌నగర్‌లో హాస్టల్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒంగోలు టూటౌన్ సీఐ వీరునాయక్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హాస్టల్ విద్యార్థినిపై ఇంట్లో లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావుతో పాటు, ఘటనకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ వంటమనిషి శారదను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.