BREAKING
thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి
Test 4
Date of Publish : 16 November 2026, 07:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం

తెలంగాణ
/ ఆదిలాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 07:20 PM
11 వీక్షణలు

ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విషాద ఘటనలు.. కేసులు నమోదు చేసిన పోలీసులు

(ఎన్ టుడే న్యూస్): అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు విషాదాన్ని నింపాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన కౌలు రైతు ఆశన్న (43) అప్పులు తీర్చే మార్గం కనిపించక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశన్న 17 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి, కంది పంటలను సాగు చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల భారంలో కూరుకుపోయినట్లు సమాచారం.

మరో ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో రైతు వెంకటయ్య (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రెండు ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం ఆయా ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది.