BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 October 2026, 08:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 08:20 AM
7 వీక్షణలు

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు భూమి పనికి భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 13: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భూమికి సంబంధించిన పని చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి కలిసి ఫిర్యాదుదారుడి భూమికి సంబంధించిన అధికారిక పని కోసం రూ.20,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్‌–సీఐయూ అధికారులు దాడి నిర్వహించి, లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో ఇద్దరినీ పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలను ఆశ్రయించే ప్రజల నుంచి భారీ మొత్తాల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి సమస్యను తెరపైకి తెచ్చాయి. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.