స్కూటీపై గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళలు అరెస్ట్
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: స్కూటీపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మట్టేవాడ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. నిందితులను శివనగర్‌కు చెందిన కొరిడి లక్ష్మి, బేగారి శాంతినిగా గుర్తించినట్లు వెల్లడించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల 6 వేలుగా అంచనా వేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.