BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 02:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జేబులో ఫోన్ పేలడంతో వినియోగదారుడికి గాయాలు..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 02:30 PM
2 వీక్షణలు

కొత్త ఫోన్ లేదా రూ.36,139 పరిహారం ఇవ్వాలని కమిషన్ ఆదేశం

అలీగఢ్: జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలి గాయాలపాలైన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ప్రేమ్‌రాజ్ సింగ్‌కు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఊరటనిచ్చింది. బాధితుడికి 45 రోజుల్లో కొత్త ఫోన్ ఇవ్వాలని లేదా రూ.36,139 పరిహారంగా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.

ప్రేమ్‌రాజ్ సింగ్ 2020లో ఓ మొబైల్ ఫోన్ కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే ఫోన్ వేడెక్కుతుండటంతో సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని పేర్కొన్నారు. 2023లో ఆయన జేబులో ఉన్న సమయంలో ఫోన్ ఒక్కసారిగా పేలడంతో గాయాలయ్యాయి.

ఆ ఫోన్‌లో తన వివాహానికి సంబంధించిన ఫొటోలు ఉండటంతో వాటిని కోల్పోవడం ఆయనకు తీవ్ర మనోవేదన కలిగించినట్లు సమాచారం. ఈ ఘటనపై న్యాయం కోరుతూ ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.

బాధితుడికి లోపాలున్న ఫోన్ అందించడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫోన్ పేలడంతో గాయాలు కావడం, గతంలో వేడెక్కుతున్నట్లు ఫిర్యాదు చేసిన అంశాలను పరిశీలించిన కమిషన్ ఫోన్‌లో లోపాలు ఉన్నాయని నిర్ధారించినట్లు కథనాలు వెల్లడించాయి.

దీంతో 45 రోజుల్లో బాధితుడికి కొత్త ఫోన్ అందించాలని లేదా దాని విలువకు పరిహారంగా రూ.36,139 చెల్లించాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. వినియోగదారులు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ పరికరాల్లో నాణ్యత, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వాటిపై ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చనే విషయాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.