BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Aug, 2026 - 07:20 PM
81 వీక్షణలు

తిరువూరు: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ సూచించారు. బోరు నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేపట్టాలని, ఇతర రైతులు తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, జొన్నలు, రాగులు సాగు చేయాలని కోరారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగులో నష్టాలను నివారించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. పంటల బీమా నమోదుకు ఆగస్టు 15, 2026 వరకు గడువు ఉన్నందున తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

యూరియా కొనుగోలు సమయంలో సాంకేతికంగా లేదా ఇతరత్రా సమస్యలు ఎదురైతే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను ప్రోత్సహించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రైతులకు విజ్ఞప్తి చేశారు.