BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:28 pm
Posted by : K MAHESH

మినీ బ్యాంకు సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్బీఐ మేనేజర్ ప్రవీణ్

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:28 PM
15 వీక్షణలు

బొడ్లాడ గ్రామంలో మినీ బ్యాంకు ప్రారంభం.. గ్రామంలోనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి

దంతాలపల్లి, నవంబర్ 21: గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న మినీ బ్యాంకు సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నెల్లికుదురు బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ సూచించారు. శనివారం దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో ఎస్బీఐ నెల్లికుదురు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ బ్యాంకును గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్నతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బొడ్లాడ గ్రామంలో మినీ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న చేసిన అభ్యర్థన మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇకపై గ్రామ ప్రజలు తమకు అవసరమైన చిన్నచిన్న బ్యాంకింగ్ లావాదేవీల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు.

ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీలకు ఈ మినీ బ్యాంకు సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. గతంలో బ్యాంకింగ్ పనుల నిమిత్తం నెల్లికుదురు, దంతాలపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు గ్రామంలోనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో సమయం, ప్రయాణ శ్రమ ఆదా అవుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ బ్యాంకింగ్ అవసరాలను సులభంగా పూర్తి చేసుకోవాలని కోరారు.

మినీ బ్యాంకు నిర్వాహకులు ఖాతాదారులకు ఆర్థిక లావాదేవీల విషయంలో సౌలభ్యం కల్పించడంతో పాటు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని మేనేజర్ ప్రవీణ్ సూచించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు కొనసాగించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మినీ బ్యాంకు నిర్వాహకులు పొట్టకార్ల ఉమేష్, వార్డు సభ్యులు జెనిగల అంజయ్య, గువ్వ రోజా, జెనిగల రమ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.