18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు — యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
ఎన్నికల సంఘం సూచించిన వివిధ రకాల 18 కార్డులను చూపించి కూడా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
గత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా జరిగిన మూడు విడత లల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని… ఈసారి ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ కావాలన్నారు
18 రకాల గుర్తింపు కార్డుల వివరాలు:-
1. UIDAI ఆధార్ కార్డు
– భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఇచ్చిన ఆధార్.
2. పీహెచ్‌ఈచ్ (PHC) ఫోటో
– ఫోటో ఐడెంటిటీగా ఉపయోగించవచ్చు.
3. డ్రైవింగ్ లైసెన్స్
4. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు
– వీటిలో ఉద్యోగులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు.
5. బ్యాంకులు/TSCAB/DCBs/కోఆపరేటివ్ సంస్థలు
– ఉద్యోగులకు ఇచ్చే ఫోటో సహిత ఐడెంటిటీ కార్డులు.
6. ఆరోగ్య పథకం (హెల్త్ కార్డు)
– ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద జారీ చేసిన కార్డులు.
7. జాతీయ జనాభా నమోదు (RGI – NPR)
– భారత రెజిస్ట్రార్ జనరల్ చేసిన NPR క్రింద ఇచ్చే ఐడెంటిటీ పత్రాలు.
8. MNREGAలో పనిచేసే కార్మికులకు ఇచ్చే కార్డు.
9) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి ఫోటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం కార్డు (ESIC) (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
10) మాజీ సైనికోద్యోగుల పింఛను పుస్తకం/పింఛను చెల్లింపు ఉత్తర్వు, మాజీ సైనికోద్యోగుల వితంతు/వారిపై ఆధారపడినటువంటి వారి చెందిన దృవపత్రాలు, వృద్ధుల పింఛను ఉత్తరువు, ఫోటోతో కూడిన వితంతు పింఛను ఉత్తరువులు వంటి ఫోటోతో కూడిన పింఛను పత్రాలు, (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
11) MLA లు/MLC లకు శాసన సభశాసన మండలి సచివాలయం జారీ చేసినటువంటి ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు.
12) ఫోటోతో కూడిన రేషను కార్డు (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
13) ప్రాధికారమివ్వబడినటువంటి అధికారిచే జారీచేసినటువంటి ఫోటోతో కూడిన ఎస్.సి.ఎస్.టి/బి.సి ధృవపత్రం. (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
14) ఫోటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు,
15) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్సు (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
16) ఫోటోతో కూడిన వికలాంగ ధృవపత్రం (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
17) పార్లమెంటు సభ్యులకు లోక్సభ/రాజ్యసభ సచివాలయం జారీచేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు.
18) ఫోటోతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు (ఎన్నికల ప్రకటన తేదీన లేదా అంతకుముందు జారీ చేసినవి)
వీటితో పాటు ఆన్లైన్ లో కూడా tsec.gov.in అనే వెబ్ సైట్ నుండి కూడా ఓటరు స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.














