BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:30 pm
Posted by : K MAHESH

బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్ విడుదల

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:30 PM
16 వీక్షణలు

మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యుడు ఆనంగళ్ళ యాదయ్య

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

ఇబ్రహీంపట్నం, నవంబర్ 21: మంచాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24న పౌర్ణమి సందర్భంగా ప్రారంభం కానున్న శ్రీ ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్‌ను దేవాలయ కమిటీ సభ్యుడు ఆనంగళ్ళ యాదయ్య ఆధ్వర్యంలో మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా వెదిరె హన్మంత్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యుడు ఆనంగళ్ళ యాదయ్య మాట్లాడుతూ బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఆలయ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాలు సుమారు 15 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ముగింపు వరకు భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సమిష్టిగా కృషి చేస్తారని చెప్పారు. భక్తుల సహకారంతో జాతర ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు వెదిరె జ్యోతి రమణ రెడ్డి, దసరమోని రమేష్ ముదిరాజ్, మనీపాటి వెంకటేష్, ఎన్నుదుల సురేష్, సపావత్ లచ్చిరాం నాయక్, బత్తుల రవీందర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బుట్టి కృష్ణ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, మారగోని మాసయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి, గ్రామ కార్యదర్శి చిందం శ్రీశైలం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెదిరె సికిందర్ రెడ్డి, మర సురేష్, ప్రజాగళం దామర భూపాల్, చిందం ఐలయ్య, పాండాల శ్రీనివాస్ గౌడ్, మడపాకుల యాదగిరి, దూసరి రాజుగౌడ్, లొంగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.