BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 11:06 pm
Posted by : V శ్రీనివాస్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:06 PM
22 వీక్షణలు

చెన్నూర్: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.

బుధవారం చెన్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, పూర్తి చేసిన మరుగుదొడ్లు, స్నానపు గదులను మంత్రి గడ్డం వివేకానంద గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. చెన్నూర్‌లోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.38 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన మిగిలిన పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రూ.35 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో అదనపు గదులు, ప్రధాన, సాధారణ మరమ్మతులు, మరుగుదొడ్లు, స్నాన

*రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, పూర్తి చేయబడిన మరుగుదొడ్లు, స్నానప గదులను గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో చెన్నూర్ లోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 38 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి. నిధులతో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల మిగిలిన నిర్మాణ పనులు, 35 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో అదనపు గదులు, ప్రధాన, సాధారణ మరమ్మత్తులు, మరుగుదొడ్లు, స్నానపు గదుల పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు, మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీరు, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.