భార్యపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఒంగోలు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన ఒంగోలులోని గోపాల్‌నగర్ 3వ లైన్‌లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన రాము, పద్మ ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పద్మ బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది.
భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం రాము తన భార్య పద్మపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన పద్మను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం రాము పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.