BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:37 pm
Posted by : K MAHESH

వెంకెపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:37 PM
22 వీక్షణలు

రైతులు ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

తుంగతుర్తి: రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా, వారి సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వెంకెపల్లి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా తీగల గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామంలోని రైతులకు ధాన్యం విక్రయించేందుకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సంబంధిత సభ్యులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

గ్రామస్థాయిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు స్థానికంగానే ధాన్యం విక్రయించే అవకాశం లభించనుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇమ్మడి జయకుమార్, ఉపసర్పంచ్ పాల్వాయి నాగయ్య, కుంట పవన్ రెడ్డి, తోనకూరి సైదులు, నకరికంటి వెంకన్న, కుంట్ల చంద్రారెడ్డి, ఎల్లిపెద్ది రవీందర్ రెడ్డి, కుంట్ల మోహన్ రెడ్డి, బత్తుల జనార్దన్, శనిగల సందీప్, ఏనుగనుదుల మహేష్, సైరెడ్డి వెంకట్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.