BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరి 19వ డివిజన్‌లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:35 AM
36 వీక్షణలు

పోతినేని శ్రీనివాసరావు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు, వార్డు కమిటీ సభ్యుల చేరిక

మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 19వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, వార్డు స్థాయి ప్రతినిధులు తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డివిజన్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ వైసీపీ నాయకుల చేరిక టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

వైసీపీ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు పూజల మనోహర్, కొత్తపేట 1వ వార్డు అధ్యక్షుడు గుండపు శంకరరావు, 2వ వార్డు అధ్యక్షుడు కొణిశెట్టి సుబ్బారావు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన నాయకులకు పోతినేని శ్రీనివాసరావు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వీరితో పాటు వార్డు కమిటీ సభ్యులు మడక శివరాం ప్రసాద్, చిన్నబత్తుల రాజేశ్వరరావు, సిరింగి క్రాంతి కుమార్, బలభద్ర వెంకటరావు, పరిమళ ఆనంద్, చంద్రాబట్ల దిలీప్ కుమార్, చట్ట నాగ సౌరి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానికంగా ప్రజలతో సంబంధాలు కలిగిన నాయకులు, వార్డు స్థాయి కార్యకర్తలు ఒకేసారి పార్టీ మారడం 19వ డివిజన్‌లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం ఉంటాయని, అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థి విజయానికి సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి రంగిశెట్టి నరేంద్ర, నాయకులు తోట పార్ధసారధి, మునగాల మల్లేశ్వరరావు, సుఖమంచి గిరిబాబు, తాడిగిరి సుధీర్, సైనాదం శ్రీనివాసరావు, దామర్ల వేణు, పూజల శ్రీనివాసరావు, కొరముట్ల రాజా, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.