కాచిగూడలో యువతి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
షాప్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాని రాధిక బహేశ్వర్
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే క్వార్టర్స్ పరిధిలో రాధిక బహేశ్వర్ అనే యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన రాధిక రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న తన అక్క నందా కిషోర్ వద్ద ఉంటోంది.
ఈ నెల 27వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో షాప్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల గాలింపు
రాధిక కోసం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ వెతికారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి రాధిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.