BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:38 pm
Posted by : KOLA MAHESH

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
07 Oct, 2026 - 09:38 PM
6 వీక్షణలు

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం 

ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో యువజన కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టి, జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా రామన్నపేట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ దేశంలో దాదాపు 14 కోట్ల ఓట్లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అక్రమ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారని అన్నారు.జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్  ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నామని అన్నారు.


తక్షణమే కేంద్రప్రభుత్వం స్పందించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని లేనిచో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షులు కేస సాయి, పట్టణ అధ్యక్షులు జవ్వాజి శ్రీకాంత్, కొమ్మగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల పరుశురాం, ఇస్కిల్లా గ్రామ శాఖ అధ్యక్షులు బందెల వినయ్, పట్టణ కార్యదర్శి కామిటికారి సాయి వెంకట్, సుర్వి మచ్చ గిరి, సుర్వి రాకేష్,  పాషా, సింగరాయబోయిన అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.