మాజీ మంత్రి పెద్దిరెడ్డి 75 వ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్ సిపి నాయకులు.
పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నాయకుల కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం
పుంగనూరు, అన్నమయ్య జిల్లా (ఎన్ టుడే న్యూస్): పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు అభివృద్ధికి చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ, పుంగనూరు అభివృద్ధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి పెద్దిరెడ్డికి మరింత పేరు తీసుకురావాలని నాయకుడు వెంకట్‌రెడ్డి యాదవ్ ప్రజలను కోరారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పుంగనూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలన కీలకమని పేర్కొన్నారు. మండలంలో ప్రజలకు పలు మౌలిక వసతులు కల్పించారని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజేష్ మాట్లాడుతూ, పుంగనూరు అభివృద్ధికి పెద్దిరెడ్డి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.