11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
వీరబల్లి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వీరబల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలై జిల్లాకు చెందిన షేక్ బర్క్ తుల్లా నూరుల్లా, పొన్నుస్వామి మాణిక్యంలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 11 ఎర్రచందనం దుంగల మొత్తం బరువు 382 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.19.10 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసిన వీరబల్లి ఎస్‌ఐ సుస్మితతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.