మార్కాపురం జిల్లాకు 11 సీజనల్ హాస్టళ్లు మంజూరు
వలస వెళ్లే కుటుంబాల పిల్లలకు విద్యకు ఆటంకం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు
మార్కాపురం, ఎన్‌టుడే న్యూస్: ఉపాధి కోసం వలస వెళ్లే కుటుంబాల పిల్లల విద్యకు ఆటంకం కలగకుండా మార్కాపురం జిల్లాకు 11 సీజనల్ హాస్టళ్లు మంజూరయ్యాయి. వలస కుటుంబాల పిల్లలకు స్థానికంగానే వసతి కల్పించి, వారి విద్యను కొనసాగించేందుకు ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో వలస కుటుంబాలకు చెందిన 558 మంది విద్యార్థులను అధికారులు గుర్తించారు. వీరి కోసం మండలాల వారీగా సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు.
బేస్తవారిపేట మండలానికి నాలుగు సీజనల్ హాస్టళ్లు, గిద్దలూరు, సీఎస్ పురం, తర్లపాడు మండలాలకు రెండేసి హాస్టళ్లు, కొమరోలు మండలానికి ఒక సీజనల్ హాస్టల్ మంజూరైనట్లు అధికారులు తెలిపారు.
వలసల కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకుండా సీజనల్ హాస్టళ్ల ద్వారా వసతి, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.