BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:19 pm
Posted by : DAVU RAVINDER REDDY

హైదరాబాద్ పరిధిలో మరో 16 కొత్త పోలీస్ స్టేషన్లు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 10:19 PM
0 వీక్షణలు

నగర విస్తరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం

హైదరాబాద్ సిటీ | Ntoday News

హైదరాబాద్ నగర విస్తరణ, మారుతున్న భౌగోళిక పరిధి, పెరుగుతున్న ప్రజల భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా 16 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి కమిషనరేట్ పరిధిలో నాలుగు చొప్పున పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 

పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన నాలుగు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు, వేగవంతమైన స్పందన అందేలా పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్నిర్వచించనున్నారు. 

జనాభా, నేరాల తీవ్రత, నగర విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డివిజన్, జోన్ స్థాయిలో కొత్త పోలీస్ స్టేషన్ల పరిధులను ఖరారు చేయనున్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగాల పరిధులను కూడా కొత్త శాంతిభద్రతల విభజనకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా నాలుగు పోలీస్ కమిషనరేట్ల వ్యవస్థ ఏర్పాటైంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.