BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:31 pm
Posted by : KOLA MAHESH

ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:31 PM
11 వీక్షణలు
  • మాలలంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలి: పెరమండ్ల యాదగిరి

వలిగొండ, అక్టోబర్‌ 27 | ఎన్‌ టుడే న్యూస్‌:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పెరమండ్ల యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెరమండ్ల యాదగిరి మాట్లాడుతూ.. జాతీయ మాల మహానాడు స్థాపించి 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మాలలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయాలను ఐక్యంగా ఎదుర్కొని, హక్కుల సాధన కోసం పోరాడాలని అన్నారు.

తెలంగాణలో మాలలకు రోస్టర్‌ పాయింట్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాలల ఐక్యత, బలాన్ని చాటాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కూచమల్ల నాగేష్‌, ఉపాధ్యక్షుడు బుంగ శేఖర్‌, సీనియర్‌ నాయకుడు, రిటైర్డ్‌ ఉద్యోగి భూతం మల్లేశం, రాపోలు పవన్‌ కుమార్‌, నీలం నరేందర్‌, దాసిరెడ్డిగూడెం సర్పంచ్‌ రాపోలు గోపి, మండల నాయకులు కట్ట దానయ్య, గూడపురి రాజు, కేతం ఇంద్ర రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.