BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 November 2025, 06:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

తెలంగాణ
23 Nov, 2025 - 06:26 AM
330 వీక్షణలు
4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి- CITU NTODAY NEWS: హైదరాబాద్ దేశంలోనే కార్మిక లోకం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బిజెపి మోడీ సర్కార్ కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు రావడాని సిఐటియు అంబర్పేట జోన్ కమిటీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ శివం రోడ్డులోని లేబర్ అడ్డా దగ్గర ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు ఎం.మహేందర్, నగర ఉపాధ్యక్షులు జి.రాములు హాజరై మాట్లాడుతూ,కార్పొరేట్ పెట్టుబడుదారులకు కార్మికుల శక్తిని కారు చౌకగా అందించి వారికి అత్యధిక లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తుందని వారు విమర్శించారు, పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో వేతనాల కోడ్(2019) పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020) సామాజిక భద్రత కోడ్ (2020) వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం పని పరిస్థితులకుకోడ్, తీసుకు వచ్చిందని ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికులు పనులు దొరకక, కంపెనీలలో ఉద్యోగాలు దొరకక, ప్రభుత్వం పని కల్పించక, పెరిగిన ధరలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మిక వర్గానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ తోటి కార్మికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది మేడే పోరాట స్ఫూర్తితో ఎనిమిది గంటల పని సాధించుకున్న కార్మిక లోకం ఇప్పుడు ఈ చట్టాల తోటి 12 గంటలు పని చేయాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది, గతంలో ఉన్న కార్మిక చట్టాలు సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు, ప్రశ్నించే హక్కు, పని భద్రత హక్కు, జీవించే హక్కు, అనేక హక్కులు సాధించుకున్నాయి, కానీ ఈ లేబర్ కోడ్స్ తోటి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయి, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, వేతనాలు పెంచుకోవడం కోసం సమ్మె చేసే హక్కు లేదు, ఉద్యోగ భద్రత లేదు, పని ప్రదేశాలలో కార్మికులకు రక్షణ లేదు, ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో కార్మికులు ఈ లేబర్ కోడ్స్ వల్ల నేట్టబడ్డారని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో కార్మిక లోకం దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.సురేష్, తిరుపతి, యాకయ్య, ప్రభాకర్, గణేష్, ఈర్యా, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube