BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 09:55 am
Posted by : NUNE SRIKANTH

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
24 Nov, 2026 - 09:55 AM
8 వీక్షణలు

కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సరూర్‌నగర్‌లోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గణపతి హోమంలో పాల్గొనడంతో పాటు శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు, ఇతర పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పరమశివుని కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు.

కార్తీక పౌర్ణమి పవిత్ర సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.