BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 12:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిషన్ వాత్సల్యపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 12:45 PM
8 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర: పిల్లల సంరక్షణ, హక్కుల పరిరక్షణ, బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పిల్లల సంరక్షణ, రక్షణకు ఉన్న వివిధ మార్గాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) ప్రతినిధి కె. యశోద మాట్లాడుతూ పిల్లల హక్కులు, బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, చిన్నారులపై జరిగే వేధింపుల నుంచి రక్షణ, ఆపదలో ఉన్న పిల్లలకు ప్రభుత్వం అందించే సహాయ సేవల గురించి వివరించారు. పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన రక్షణ, సహాయాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్. లత మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.