BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 12:17 pm
Posted by : K MAHESH

ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ నాగర్ కర్నూల్ / అచంపేట్
Reporter
K Mahesh Munugodu Constituency
24 Nov, 2026 - 12:17 PM
10 వీక్షణలు

నాగర్ కర్నూల్‌లో రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం.. కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి, రాష్ట్రవ్యాప్త చీరల పంపిణీ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు.

వాస్తవానికి ఈ నెల 19న సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే కొన్ని కారణాలతో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ఈ నెల 26న నాగర్ కర్నూల్ నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

కోటి మంది మహిళలకు చీరల పంపిణీ లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 35 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ ఏర్పాట్లు చేపట్టింది.

మహిళలకు సంక్షేమ పథకం ద్వారా చేరువ

మహిళలకు చీరలు పంపిణీ చేయడం ద్వారా పండుగ వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నాగర్ కర్నూల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.