BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 12:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయచోటిలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఉమామహేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 12:38 PM
9 వీక్షణలు

తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై భక్తుల బారులు.. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు అన్నమయ్య జిల్లా, రాయచోటి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయచోటి పట్టణంలోని శివనంది సర్కిల్ వద్ద వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలతో పాటు జాతీయ రహదారిపై భక్తులు బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు నటరాజ స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అరమాటి శివగంగి రెడ్డి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామి ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగింది.