తల్లికి వందనం పథకంలో మరో 58,601 మంది విద్యార్థులకు చోటు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో మరో 58,601 మంది విద్యార్థులను అర్హులుగా చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా అర్హత పొందిన విద్యార్థులతో కలిపి రెండో విడతలో మొత్తం 3,29,201 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందనున్నట్లు తెలుస్తోంది.
తాజా నిర్ణయంతో ‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అర్హులైన విద్యార్థుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు పెరగనుంది. దీంతో మరింత మంది విద్యార్థుల కుటుంబాలకు పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం అందే అవకాశం ఉంది.
రెండో విడత ఆర్థిక సాయాన్ని దసరా పండుగలోపు లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం తదుపర